టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ ప్రయాణం మొదలుపెట్టిన దగ్గర్నుంచి ఒకటే గోల. ఇండియా అడ్వాంటేజ్ తీసుకుంటుంది అని. కేవలం దుబాయ్ లో ఒకే పిచ్ మీద ఆడుతూ ఛాంపియన్స్ ట్రోఫీ కొట్టామనేది ప్రధాన ఆరోపణ. ఇది ఏ ఫ్యాన్సో చేయటం లేదు...భారత్ మీద ఓడిపోయిన జట్ల మాజీ ఆటగాళ్లు..విదేశీ మీడియా సంస్థలు..ఆఖరకు ప్లేయర్లు కూడా టీమిండియా పొందిన ఈ అడ్వాంటేజ్ పైనే మాట్లాడారు. అసలు ఇష్యూ ఏంటంటే ఛాంపియన్స్ ట్రోఫీని హోస్ట్ చేసింది పాకిస్థాన్ వాస్తవానికి. కానీ భద్రతా కారాణాల రీత్యా పాకిస్థాన్ లో పర్యటనకు మన ఆటగాళ్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించలేదు. ఫలితంగా ఐసీసీ ఛైర్మన్ గా ఉన్న జై షా ఓ ప్రతిపాదనను మిగిలిన దేశాల బోర్డుల ముందు ఉంచారు. భారత్ దుబాయ్ లో తమ మ్యాచ్ లు ఆడుతుంది. మిగిలిన జట్లు పాక్ లో మ్యాచ్ లు ఆడతాయి. భారత్ మ్యాచ్ ఉన్నవాళ్లు దుబాయ్ కి వచ్చి వెళ్తుంటారు. దీనికి అన్ని దేశాల క్రికెట్ బోర్డులు అంగీకరించాయి. ముందుగా అనుకున్నట్లుగానే భారత ఆటగాళ్లు దుబాయ్ లో దిగారు. అక్కడే తమ మ్యాచులున్నీ ఆడారు. ఫైనల్లో భారత్ ఉంటే ఫైనల్ మ్యాచ్ కూడా దుబాయ్ లోనే జరగాలనేది కూడా ముందే డిసైడ్ అయ్యింది. బాగా ఆడారు కాబట్టి టీమిండియా ఫైనల్ కి చేరుకుంది. ఫైనల్ కూడా దుబాయ్ లోనే జరిగింది.